Verse
నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి
నిన్ను పాడి కీర్తించెదను
యేసయ్యా… నీ ప్రేమ పొంగుచున్నది‖ 2x ‖
పరిశుద్ధమైన పరవశమే
పరమ యేసుని కృపా వరమే‖ 2x ‖
వెదకి నన్ను కనుగొంటివి‖ 2x ‖
పాడుటకు పాటనిచ్చితివి‖ 2x నీ పాదం ‖
నూతన నూనె ప్రభావముతో
నూతన కవిత్వపు కృపతోను‖ 2x ‖
నింపి నిత్యము నడిపితివి‖ 2x ‖
నూతన షాలేము చేర్చేడవు‖ 2x నీ పాదం ‖
ఇరుకు నందు పిలచితివి
నాకు సహాయము చేసితివి‖ 2x ‖
చెడి ఎక్కడ తిరుగకుండా‖ 2x ‖
చేరవచ్చి నన్ను ఆడుకొంటివి‖ 2x నీ పాదం ‖
నిత్యముగ నీ సన్నిధి
నాకు ఇచ్చును విశ్రాంతిని‖ 2x ‖
దుడ్డు కర్ర నీ దండమును‖ 2x ‖
నిజముగ నన్ను ఆదరించును‖ 2x నీ పాదం ‖
ఫలించు చెట్టు నీవు నిలచు
తీగగా నేను వ్యాపించుటకై‖ 2x ‖
కొమ్మ నరికి కలుపు తీసి‖ 2x ‖
కాపాడి శుద్దీకరించితివి‖ 2x నీ పాదం ‖
పరిశుద్ధమైన కీర్తితోను
ప్రకాశమైన శిఖరముపై‖ 2x ‖
శీఘ్రముగ చేర్చెదవు‖ 2x ‖
సీయోనులో నిన్ను కీర్తించెదన్‖ 2x నీ పాదం ‖