Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Paadamul Ne Cheragaa Gaayambulun Ne Gaanchithin

నీ పాదముల్ నే చేరగా గాయంబులున్ నే గాంచితిన్

Nee Paadamul Ne Cheragaa Gaayambulun Ne Gaanchithin

Lyricist: Moses Undru
Verse
నీ పాదముల్ నే చేరగా – గాయంబులున్ నే గాంచితిన్
నీ సిలువకై నే చేరగా – నీ ప్రేమను నే పొందితిన్
నా కొరకే ఈ మరణమా – నా పాపమే కారణమా‖ 2x నీ పాదముల్ ‖
Verse
నా అతిక్రమముల బట్టి గాయపరచబడెగా
నా దోషములను బట్టి నలుగగొట్టబడెగా‖ 2x ‖
సమాధానార్థమైన శిక్ష మీద పడెను
పాపపరిహార్థ బలిగ వధియించబడెను‖ 2x నా కొరకే ‖
Verse
వధకు తేబడు గొర్రెపిల్ల నిలచునట్లుగా
మౌనముగా నుండి నీవు తీర్పునొందితివివే‖ 2x ‖
నీ వేదన చూసి హేళన చేసిన గానీ
వీరేమి చేతిరో ఎరుగరంటివే‖ 2x నా కొరకే ‖

Related Tags

RepentanceCrossGood FridaySacrifice