Verse
నీ పద సేవయే చాలు
యేసు నాకదియే పది వేలు
నీ పద సేవయే చాలు
నీ పద జ్ఞానము నాకిలా క్షేమము
నీ పద గానము నాకిలా ప్రాణము‖ 2x నీ పద ‖
Verse
నీ నామమునే స్తుతియింపగను
నీ వాక్యమునే ధ్యానింపగను‖ 2x ‖
నీ రాజ్యమునే ప్రకటింపగను‖ 2x ‖
దీవెన నాకిలా దయచేయుమా‖ నీ పద ‖
Verse
నీ దరినే నివసింపగను
జీవమునే సాధింపగను‖ 2x ‖
సాతానును నే నెదిరింపగాను‖ 2x ‖
దీవెన నాకిలా దయచేయుమా‖ నీ పద ‖
Verse
నీ ప్రేమను నే చూపింపగను
నీ త్యాగమునే నొనరింపగను‖ 2x ‖
నీ సహనమునే ధరియింపగను‖ 2x ‖
దీవెన నాకిలా దయచేయుమా‖ నీ పద ‖