Verse
నీ ప్రేమ బహు గొప్పది యేసయ్య
Verse
పాపాల సుడిగాలిలో- పడిపొతి నిను తెలియక
శాపాల సముద్రములో- దిగిపోతి నిను యెరుగక
కరుణించినావు - కాపాడినావు, కరములు చాపి నన్ను లేపావు
Verse
పాపిని రక్శింపనూ-పరలొకము విడచినాయ్య
నన్ను పరిశుద్దునిగా చేయనూ - నీ రక్తన్ని కార్చావయ్య
నీచుని ప్రేమించి-నీ ప్రాణమిచ్చావు
నీ నిత్యరాజ్యములో వారసునిగా చేశావు
Verse
నీ ప్రేమనే చాటను- నన్నిలలో నిలిపావయ్య
నీ సాక్శిగా బ్రతుకను-నీ క్రుప నాకు చూపావయ్య
ఏమిచ్చి నీ రుణం - నే తీర్చగలనయ్య
నా జీవితం- నీకు అర్పింతును యెసయ్య