Verse
నీ ప్రేమ నా జీవితాన్ని – నీకై వెలిగించెనే యేసయ్యా
నీ కృప సెలయేరులా – నాలో ప్రవహించెనే‖ 2x ‖
నన్ను క్షమియించెనే – నన్ను కరుణించెనే
నన్ను స్థిరపరచెనే – నన్ను ఘనపరచెనే‖ 2x ‖
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా‖ 2x ‖
Verse
నేను నిన్ను విడచిననూ – నీవు నన్ను విడువలేదయ్యా
దారి తప్పి తొలగిననూ – నీ దారిలో నను చేర్చినావయ్యా‖ 2x ‖
ఏమివ్వగలను నీ కృపకు నేను
వెలకట్టలేను నీ ప్రేమను‖ 2x యేసయ్యా ‖
Verse
జలములు నన్ను చుట్టిననూ – నీ చేతిలో నను దాచినావయ్యా
జ్వాలలు నాపై లేచిననూ – నీ ఆత్మతో నను కప్పినావయ్యా‖ 2x ‖
ఏమివ్వగలను నీ కృపకు నేను
వెలకట్టలేను నీ ఆత్మను‖ 2x యేసయ్యా ‖