Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Prema Naaku Kaavalayya

నీ ప్రేమ నాకు కావాలయ్యా

Nee Prema Naaku Kaavalayya

Verse
ప్రేమలేని జీవితం నాది యేసయ్య
నీ కల్వరి ప్రేమలో నన్ను నింపవయ్యా
Chorus
నీ ప్రేమ నాకు కావాలయ్యా
నీ స్నేహం నాకు కావాలయ్యా‖ 2x యేసయ్య యేసయ్య ‖
Verse
ప్రార్థనలేని హృదయం నాది యేసయ్య
నీ ప్రార్థనతో నన్ను నింపవయ్యా‖ 2x ‖
నీ వాక్కులేని నా హృదయం
నీ వాక్యంతో నన్ను నింపవయ్యా
యేసయ్య యేసయ్య
Chorus
నీ ప్రేమ నాకు కావాలయ్యా
నీ స్నేహం నాకు కావాలయ్యా‖ 2x ‖
Verse
చీకటిలో ఉన్న నన్ను
నీ వెలుతురుతో నింపవయ్యా‖ 2x ‖
ముల్లులాంటి జీవితం నాది యేసయ్య
నీ ప్రేమతో నా జీవితం పువ్వుగా మార్చవయ్యా
యేసయ్య యేసయ్య
Chorus
నీ ప్రేమ నాకు కావాలయ్యా
నీ స్నేహం నాకు కావాలయ్యా‖ 2x ‖
Verse
తల్లి ప్రేమలేని జీవితం నాది యేసయ్య
నీ కల్వరి ప్రేమతో నన్ను చేరదీసావయ్యా
తండ్రి స్నేహంలేని జీవితం నాది యేసయ్య‖ 2x ‖
నీ స్నేహంతో నా జీవితాన్ని ధైర్యపరచావయ్యా
యేసయ్య యేసయ్య
Chorus
నీ ప్రేమ నాకు కావాలయ్యా
నీ స్నేహం నాకు కావాలయ్యా‖ 2x ‖
Verse
ఎవరితడు లేని జీవితం నాది యేసయ్య
నీ నీడలో నన్ను కాచావయ్యా
బంధువులే నా మనసును గాయపరచగా
నీ ప్రేమతో నా మనసును ఓదార్చావయ్యా‖ 2x యేసయ్య యేసయ్య ‖
Chorus
నీ ప్రేమ నాకు కావాలయ్యా
నీ స్నేహం నాకు కావాలయ్యా‖ 2x ‖
Verse
ప్రతిక్షణం శోధనలో గడిపిన జీవితం నాది
నీ నామములో నాకు విడుదల ఇచ్చావయ్యా
పలు చెడు అలవాట్లకు లోనయ్యానయ్యా
నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధి పరిచావయ్యా‖ 2x యేసయ్య యేసయ్య ‖
Chorus
నీ ప్రేమ నాకు కావాలయ్యా
నీ స్నేహం నాకు కావాలయ్యా‖ 2x ‖

Related Tags

PrayerSalvationLove