Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Prema Naalo Madhuramainadi

నీ ప్రేమ నాలో మధురమైనది

Nee Prema Naalo Madhuramainadi

Lyricist: Hosanna Ministries
Verse
నీ ప్రేమ నాలో మధురమైనది
అది నా ఊహకందని క్షేమ శిఖరము‖ 2x ‖
ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను
పరవశించి నాలో మహిమపరతు నిన్నే
సర్వకృపానిధి నీవు – సర్వాధికారివి నీవు
సత్య స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే‖ నీ ప్రేమ ‖
Verse
చేరితి నిన్నే విరిగిన మనస్సుతో
కాదనలేదే నా మనవులు నీవు‖ 2x ‖
హృదయము నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం
నిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం‖ 2x ‖
ఇది నీ బాహు బంధాల అనుబంధమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే‖ 2x నీ ప్రేమ ‖
Verse
నా ప్రతి పదములో జీవము నీవే
నా ప్రతి అడుగులో విజయము నీవే‖ 2x ‖
ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాదా
నీడగా నాతో నిలిచే – నీ కృపయే నాకు చాలును‖ 2x ‖
ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే‖ 2x నీ ప్రేమ ‖
Verse
నీ సింహాసనము నను చేర్చుటకు
సిలువను మోయుట నేర్పించితివి‖ 2x ‖
కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు
దయగల ఆత్మతో నింపి – సమాభూమిపై నడిపినావు‖ 2x ‖
ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే‖ 2x నీ ప్రేమ ‖

Related Tags

PraiseWorshipLove