Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Prema Nee Karuna

నీ ప్రేమా నీ కరుణా

Nee Prema Nee Karuna

Lyricist: P Satish Kumar
Verse
నీ ప్రేమా నీ కరుణా చాలునయ్యా నా జీవితాన
మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన
చాలయ్య చాలీ దీవెనలు చాలు
మేలయ్య మేలు నీ సన్నిధి మేలు‖ 2x ‖
Verse
గురిలేని నన్ను గుర్తించినావే
ఎనలేని ప్రేమను చూపించినావే
వెలలేని నాకు విలువిచ్చినావే
విలువైన పాత్రగా నను మార్చినావే‖ నీ ప్రేమా ‖
Verse
చేజారిన నాకై చేచాచినావే
చెదరిన నా బ్రతుకును చేరదీసినావే
చెరనుండి నన్ను విడిపించినావే
చెరగని నీ ప్రేమకు సాక్షిగ మార్చావే‖ నీ ప్రేమా ‖
Verse
నరకపు పొలిమేరలో నను కనుగొన్నావే
కల్వరిలో ప్రాణమిచ్చి నను కొన్నావే
నీ ప్రేమను ప్రకటింప నను ఎన్నుకొన్నావే
నీ కుమారునిగా నను మార్చినావే‖ నీ ప్రేమా ‖

Related Tags

PraiseWorshipGrace