Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Prema Nee Karuna Chaalunaya Naa

నీ ప్రేమా నీ కరుణా చాలునయా నా

Nee Prema Nee Karuna Chaalunaya Naa

Lyricist: Vijay
Verse
నీ ప్రేమా. . నీ కరుణా. . చాలునయా నా జీవితానా
మరి దేనినీ ఆశించనూ నే కోరను ఈ జగానా
చాలయ్య చాలు దీవెనలు చాలు
మేలయ్య మేలు నీ సన్నిధి మేలు
Verse
గురిలేని నన్ను గుర్తించినావే
ఎనలేని ప్రేమను చూపించినావే
వెలలేని నాకు విలువిచ్చినావే
విలువైన పాత్రగా నను మార్చినావే
Verse
చేజారిన నాకై చేజాచినావే
చెదరిన నా బ్రతుకును చేరదీసినావే
చెరనుండి నన్ను విడిపించినావే
చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే
Verse
నరకపు పొలిమేరలో నను కనుగొన్నావే
కల్వరిలో ప్రాణమిచ్చి ననుకొన్నావే
నీ ప్రేమను ప్రకటింప నను ఎన్నుకొన్నావే
నీ కుమారునిగా నను మార్చినావే

Related Tags

GraceSurrenderGods Love