Verse
నీ ప్రేమకు సాటి లేనే లేదు
ప్రేమారూపా యేసురాజా‖ 2x ‖
నింగియందునా – నేల యందునా
పాతాళమందునా – ఎందైన గాని‖ 2x ‖
నీకన్నా అధికులు ఎవరు లేనే లేరు‖ నీ ప్రేమకు ‖
పాపినైన నా కొరకు – పరలోకం విడచినదెవరు
నా పాపముల కొరకై – సిలువలో మరణించినదెవరు‖ 2x ‖
క్షమియించి రక్షించిన నా తండ్రి నీవే‖ నీ ప్రేమకు ‖
ధరలోని ధన ధాన్యములు – నన్ను వీడినా
ఇలలో నా సరివారు – త్రోసివేసినా‖ 2x ‖
ఇహమందు పరమందు నా ధనము నీవే‖ నీ ప్రేమకు ‖