Verse
నీ ప్రేమకు సాటి లేదయా
యేసయ్యా… నీ సన్నిధి నాకు మేలయ్యా‖ 2x ‖
నా కొరకై ప్రాణమిచ్చితివి
నా కొరకై సిలువనెక్కితివి‖ 2x ‖
కరుణించి కాపాడుమా నా యేసయ్యా
కన్నీటి ప్రార్దన ఆలకించుమా‖ 2x నీ ప్రేమకు ‖
Verse
అవిశ్వాసురాలై నేనుండగా అంధకారమందు రక్షించితివే
నా దీనస్థితిలో నా దరికి చేరి నీ వాక్యముతో బలపరచితివి‖ 2x ‖
మనోహరమైన నీ కృపనిచ్చి నన్నాదరించితివే‖ 2x ‖
నా బ్రతుకు దినములన్ని నిను వేడెదన్ నా యేసయ్యా‖ 2x ‖
నా యేసయ్యా….‖ నీ ప్రేమకు ‖
Verse
ఏమివ్వగలను నీ ప్రేమకు నా సర్వము నీవేనయా
నా అతిశయము ఆధారము నాకన్నియు నీవేనయా‖ 2x ‖
విశ్వాసముతో నీటిపైన నన్ను నడువనిమ్ము‖ 2x ‖
నా అడుగులు తడబడగా నన్నెత్తుకో నా యేసయ్యా‖ 2x ‖
నా యేసయ్యా….‖ నీ ప్రేమకు ‖