Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Premalo Nundi Nannu Edabaapu Vaarevaru

నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు

Nee Premalo Nundi Nannu Edabaapu Vaarevaru

Verse
నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు‖ 2x ‖
శ్రమలైనను శత్రువైనను
నిన్ను నన్ను వేరు చేయలేవు
యేసయ్యా యేసయ్యా నిను మరువలేనయ్యా
యేసయ్యా యేసయ్యా నిను విడువలేనయ్యా‖ 2x ‖
క్షణమైన నువ్వు లేక నే ఉండలేనయ్యా‖ 2x నీ ప్రేమలో ‖
Verse
జీవించుచున్నది నేను కాదు
క్రీస్తే నాలో జీవిస్తున్నాడు‖ 2x ‖
ఏదేమైనా నాకు యేసే కావాలి
ఎవరేమన్నా నాకు యేసే కావాలి‖ 2x యేసయ్యా ‖
Verse
నీ చిత్తం చేయుటకు నాకు ఆనందం
నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను‖ 2x ‖
ఏమిచ్చినా నీకు స్తోత్రాలే
ఏమివ్వక పోయినా వందనాలే‖ 2x యేసయ్యా ‖
Verse
ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను
నీ కోసమే నీ ప్రేమ కోసమే‖ 2x ‖
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైననేమి అది లాభమే‖ 2x యేసయ్యా ‖

Related Tags

FaithDevotionGods Love