Verse
నీ ప్రేమను నీ కరుణను
నీ శాంతిని నీ శక్తిని
నీ వివేకము నీ సాత్వీకము
నీ వినయము నీ స్వభావము
నాలో నింపుము
నింపుము నీ కాంతిని
పరిశుద్దుడా నీ ఆత్మను
మా హృదిలో నింపుము
నీ మహిమ నీ ఘనత
నీ ప్రభావం నిలుచును…..
నిరతము ఓ యేసయ్య
Verse
శోధన వేదన భరియించుచు
శిలువలో శ్రమలను పొందుచు
నిన్ను హింసించిన వారిని
నీవు మన్నించిన రీతిగ
మమ్మును మన్నించుము దేవా నేడే
Verse
నీతో కూడ శిలువలో వ్రేలడిన
నేరస్తులలో ఒకని మొరను విని
నేడు నీవు నాతో పరదేసులో
ఉందువంటు నీవిచ్చిన అభయము
మాకును దయచేయుము దేవా నేడే