Verse
నీ ప్రియ ప్రభుని సేవకై – అర్పించుకో నీవే
పవిత్ర ప్రజలైన మీరు – సేవించుడాయననే‖ 2x ‖
Verse
అంధకార జీవితమునకు – వెలుగు తెచ్చెను తానే‖ 2x ‖
ఆ వెలుగు ద్వారానే – నూతన మార్గము కలిగె‖ 2x ‖
సజీవ బలిగా నర్పించు – నీ జీవితమాయనకే‖ 2x నీ ప్రియ ‖
Verse
తప్పిపోతివి గతమందు – తప్పు దారిని నడిచితివి‖ 2x ‖
తన ప్రేమా హస్తమే – నిన్ను కాపాడి తెచ్చెను‖ 2x ‖
యెంతైన స్మరియించు నీవు – వింతైన తన ప్రేమన్‖ 2x నీ ప్రియ ‖
Verse
ఓ ప్రియుడా తలచితివా – నీ జన్మమే పాపమని‖ 2x ‖
ప్రభువే తన రక్తముతో – నీ పాపము క్షమియించె‖ 2x ‖
నీ యుల్లము ఆయన కాలయమే – జ్ఞాపకముంచుకొనుము‖ 2x నీ ప్రియ ‖
Verse
యెవరతని సేవించెదరో – ఫలమొందెదరంతమందు‖ 2x ‖
ఇతరులకు లేనట్టి – ఆ ఘనతను నీ కిచ్చె‖ 2x ‖
కృతజ్ఞుడవై కొనియాడు – ప్రభు పాద సన్నిధిని‖ 2x నీ ప్రియ ‖