Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Priya Prabhuni Sevakai Arpinchuko Neeve

నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకో నీవే

Nee Priya Prabhuni Sevakai Arpinchuko Neeve

Verse
పల్లవి: నీ ప్రియ ప్రభుని సేవకై - అర్పించుకో నీవే
పవిత్ర ప్రజలైన మీరు - సేవించుడాయననే
Verse
అంధకార జీవితమునకు - వెలుగు తెచ్చెను తానే
ఆ వెలుగు ద్వారానే - నూతనమార్గము కలిగే
సజీవ బలిగా నర్పించు - నీ జీవితమాయనకే
Verse
తప్పిపోతివి గతమందు - తప్పు దారిని నడిచితివి
తన ప్రేమాహస్తమే - నిన్ను కాపాడి తెచ్చెను
యెంతైన స్మరియించు నీవు - వింతైన తన ప్రేమన్
Verse
ఓ ప్రియుడా తలచితివా - నీ జన్మమే పాపమని
ప్రభువే తన రక్తముతో - నీ పాపము క్షమియించె
నీ యుల్లము ఆయన కాలయమే - జ్ఞాపకముంచుకొనుము
Verse
యెవరతని నేవించెదరో - ఫలమొందెదరంతమందు
ఇతరులకు లేనట్టి - ఆ ఘనతను నీ కిచ్చె
కృతజ్ఞుడవై కొనియాడు - ప్రభుపాద సన్నిధిని

Related Tags

SurrenderDedicationService