Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Raktam Challindi O Devaa

నీ రక్తం చల్లింది ఓ దేవా

Nee Raktam Challindi O Devaa

Lyricist: Raj Prakash Paul
Verse
నీ రక్తం చల్లింది ఓ దేవా
ఇదియే మాకు శక్తి మాకు దైర్యం
నీ ప్రేమే మమ్మును కాపాడింది
ఓ..చీకటిలో వెలుగునిచ్చింది‖ Jai Jai ‖
Verse
ప్రతి శాపపాపములను మోసితివే
నా శిక్ష అంత నీవు భరియించితివే
కరుణతో నన్ను రక్షించి
నీతిమంతునిగా చేసితివే‖ Jai Jai ‖
Chorus
నేను గెలిచాను
నీ చేతిలో గెలిచాను
నీ ఆత్మ శక్తితో నిత్యము గెలిచెదను‖ Jai Jai ‖
Verse
పాపాలను నీ రక్తముతో కడిగావు
కష్టాలని నీ ప్రేమతో తొలిగావు
మరి ఇప్పుడు విడుదల నేర్పించావు
నా ఆత్మకు శాంతిని ఇచ్చావు
నీవు చేయలేనిది ఏమైనా కలదా
నీవు చేరలేని చోటు ఏముందా
నీ విజయ గర్జన నా వైపు
నీ వాక్యం నా వైపు
నీ శక్తి నా వైపు
నీ ప్రేమ నావైపు
Chorus
నేను గెలిచాను
నీ చేతిలో గెలిచాను
నీ ఆత్మ శక్తితో నిత్యము గెలిచెదను
Bridge
ర్యాప్:
ప్రధానులను అధికారులను
నిరాయుధులుగా చేసి
సిలువచేత జయోత్సవముతో
బాహాటముగా కనపరచితివి
మృత్యుంజయుడైన రాజుకే
సింహాసనాసీనునికే
చెరను చెరగా కొనిపోయిన
ఘన వీర ధీర మహా రాజుని బట్టే
Chorus
నేను గెలిచాను
నీ చేతిలో గెలిచాను
నీ ఆత్మ శక్తితో నిత్యము గెలిచెదను

Related Tags

WorshipSalvationVictory