Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Rakthame Nee Rakthame

నీ రక్తమే నీ రక్తమే

Nee Rakthame Nee Rakthame

Lyricist: Songs Of Zion
Verse
నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్
నీ రక్తమే నా బలము‖ 2x ‖
Verse
నీ రక్త ధారలే ఇల
పాపికాశ్రయంబిచ్చును‖ 2x ‖
పరిశుద్ధ తండ్రి పాపిని
కడిగి పవిత్ర పరచుము‖ 2x నీ రక్తమే ‖
Verse
నశించు వారికి నీ సిలువ
వెర్రితనముగ నున్నది‖ 2x ‖
రక్షింపబడుచున్న పాపికి
దేవుని శక్తియై యున్నది‖ 2x నీ రక్తమే ‖
Verse
నీ సిల్వలో కార్చినట్టి
విలువైన రక్తముచే‖ 2x ‖
పాప విముక్తి చేసితివి
పరిశుద్ధ దేవ తనయుడా‖ 2x నీ రక్తమే ‖
Verse
పంది వలె పొర్లిన నన్ను
కుక్క వలె తిరిగిన నన్ను‖ 2x ‖
ప్రేమతో చేర్చుకొంటివి
ప్రేమార్హ నీకే స్తోత్రము‖ 2x నీ రక్తమే ‖
Verse
నన్ను వెంబడించు సైతానున్
నన్ను బెదరించు సైతానున్‖ 2x ‖
దునుమాడేది నీ రక్తమే
దహించేది నీ రక్తమే‖ 2x నీ రక్తమే ‖
Verse
స్తుతి మహిమ ఘనతయు
యుగయుగంబులకును‖ 2x ‖
స్తుతి పాత్ర నీకే చెల్లును
స్తోత్రార్హుడా నీకే తగును‖ 2x నీ రక్తమే ‖

Related Tags

WorshipBlood Of JesusRedemptionHoliness