Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Rakthame Nee Rakthamenan Shuddheekarinchun Nee Rakthame Naa Balamu

నీ రక్తమే నీ రక్తమేనన్ శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము

Nee Rakthame Nee Rakthamenan Shuddheekarinchun Nee Rakthame Naa Balamu

Verse
పల్లవి:
నీ రక్తమే నీ రక్తమేనన్ - శుద్ధీకరించున్ - నీ రక్తమే నా బలము
నీ రక్తధారలేయిల - పాపికాశ్రయంబిచ్చును
పరిశుద్ధ తండ్రి పాపిని - కడిగి పావన పరచుము
Verse
నశించు వారికి నీ సిలువ - వెర్రితనముగా నున్నది
రక్షింపబడుచున్న పాపికి - దేవుని శక్తియై యున్నది‖ నీ రక్తమే ‖
Verse
నీ సిలువలో కార్చినట్టి - విలువైన రక్తములోన
పరమ పావన కడుగుము - పవిత్ర పరచుము పాపిని‖ నీ రక్తమే ‖
Verse
పందివలె పొర్లిన నన్ను - కుక్క వలె తిరిగిన నన్ను
ప్రేమతొ చేర్చుకొంటివి - ప్రేమార్హ నీకె స్తోత్రము‖ నీ రక్తమే ‖
Verse
నన్ వెంబడించు సాతాన్ - నన్ బెదరించు సాతానున్
దును మాడేది నీ రక్తమే - దహించేది నీ రక్తమే‖ నీ రక్తమే ‖
Verse
స్తుతి మహిమ ఘనతయు - యుగ యుగంబులకు
స్తుతి పాత్ర నీకె చెల్లును - స్తోత్రార్హ నీకె తగును‖ నీ రక్తమే ‖

Related Tags

PraiseBlood Of JesusSalvation