Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Rekkala Chaatuna Sharanondedan

నీ రెక్కల చాటున శరణొందెదన్

Nee Rekkala Chaatuna Sharanondedan

Verse
నీ రెక్కల చాటున శరణొందెదన్‖ 2x ‖
నా విశ్రమ గృహమైన ప్రభువా‖ 2x ‖
మొఱ్ఱ పెట్టెదను ఉత్సహించెదను‖ 2x ‖
మిగిలిన జీవిత కాలమంతయును‖ 2x ‖
Verse
అలసితిని నే నవిధేయతతో‖ 2x ‖
కృంగితి నేను పాపము చేతన్‖ 2x ‖
లేపితివి నన్ను హత్తుకొంటివి
నీవు మోపిన కాడి - నాకు విశ్రాంతి
Verse
గువ్వను పోలి ఎగిరి పోదును
నెమ్మది నొందెదనని తలచితిని
లేదు లేదు విశ్రాంతెచ్చట
నీ విశ్రాంతిలో తిరిగి నే చేరితిన్
Verse
చేసితివి మాతో వాగ్దానమును
నీ విశ్రాంతిలో ప్రవేశింపచేయన్
మానెదము మా ప్రయాసమును
పొందెదము క్రీస్తులో విశ్రాంతిని
Verse
సిలువపై శ్రమలొందితివి
కార్చితివి నీ రక్తము మాకై
లేచితివి నీవు మరణము గెల్చి
కూర్చితివి నీ సంఘముగా మమ్ము
Verse
భంగపరచితి నీ విశ్రాంతిని
యాకోబువంటి నా నడవడితో
మార్పు నొందితి - బేతేలు నందు
ఇక విశ్రమించుము - నాలో ప్రభువా

Related Tags

WorshipRefugeRest