Verse
నీ రూపు చూడ నేనాశపడితి
నీ దర్శనమునే నే కోరుకుంటి‖ 2x ‖
నీ సుందర రూపము చూపించు దేవా
నీ మెల్లని స్వరమును వినిపించు ప్రభువా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా‖ 2x ‖
Verse
పదివేలమందిలో అతి సుందరుడా
పరలోకనాథా అతికాంక్షనీయుడా‖ 2x ‖
నా ఆశ తీరగను నిన్ను నేను చూడాలి‖ 2x ‖
మధురాతి మధురంబు నీ స్వరము వినాలి‖ 2x హల్లెలూయా ‖
Verse
నీ సన్నిధిలో సుఖ శాంతి దొరికే
నీ మాటతోనే జీవంబు కలిగే‖ 2x ‖
నీ తోడు నీడలో నా బ్రతుకు సాగాలి‖ 2x ‖
నీ దరహాసములో నేనెదిగి పోవాలి‖ 2x నీ రూపు ‖