Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Roopu Chooda Nenaashapadithi

నీ రూపు చూడ నేనాశపడితి

Nee Roopu Chooda Nenaashapadithi

Verse
నీ రూపు చూడ నేనాశపడితి
నీ దర్శనమునే నే కోరుకుంటి‖ 2x ‖
నీ సుందర రూపము చూపించు దేవా
నీ మెల్లని స్వరమును వినిపించు ప్రభువా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా‖ 2x ‖
Verse
పదివేలమందిలో అతి సుందరుడా
పరలోకనాథా అతికాంక్షనీయుడా‖ 2x ‖
నా ఆశ తీరగను నిన్ను నేను చూడాలి‖ 2x ‖
మధురాతి మధురంబు నీ స్వరము వినాలి‖ హల్లెలూయా ‖
Verse
నీ సన్నిధిలో సుఖ శాంతి దొరికే
నీ మాటతోనే జీవంబు కలిగే‖ 2x ‖
నీ తోడు నీడలో నా బ్రతుకు సాగాలి‖ 2x ‖
నీ దరహాసములో నేనెదిగి పోవాలి‖ నీ రూపు ‖

Related Tags

WorshipDevotionalLonging