Verse
నీ సాక్ష్యము ఏది
నీ బలియర్పణ ఏది‖ 2x ‖
ప్రభు యేసునంగీకరించి – నిద్రించెదవేల
ప్రభు యేసునంగీకరించి – జాగు చేసెదవేళ
మేల్కో లెమ్ము‖ 2x ‖
రారమ్ము విశ్వాసి‖ నీ సాక్ష్యము ‖
Verse
అపోస్తుల కాలమందు
ఉపద్రవముల ఒత్తిడిలో‖ 2x ‖
అన్నింటి సహించుచు‖ 2x ‖
ఆత్మలాదాయము చేసిరి‖ నీ సాక్ష్యము ‖
Verse
కొరడాతో కొట్టబడిరి
చెరసాలయందుంచబడిరి‖ 2x ‖
చెరసాల సంకెళ్లును‖ 2x ‖
వారినాటంక పరచలేదు‖ నీ సాక్ష్యము ‖
Verse
కోత విస్తారమెంతో
కోత కోయువారు కొందరే‖ 2x ‖
యేసు నిన్ పిలచుచుండే‖ 2x ‖
త్రోసివేసెదవా ప్రభు పిలుపును‖ నీ సాక్ష్యము ‖