Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Sallani Soope O Yesayya

నీ సల్లని సూపే ఓ యేసయ్యా

Nee Sallani Soope O Yesayya

Verse
నీ సల్లని సూపే ఓ యేసయ్యా
నా బతుకును మార్చింది మెస్సీయా
నీ మెల్లని మాటే ఓ యేసయ్యా
నను సేదదీర్చింది మెస్సీయా
Verse
పశుశాలలో నీ జన్మ యేసయ్యా - తగ్గింపు నేర్పింది మెస్సీయా
పరిశుద్ధ నీ నడత యేసయ్యా - మాదిరి నాకుంచింది మెస్సీయా
Verse
నీవు కార్చిన రక్తం యేసయ్యా - నా పాపం కడిగింది మెస్సీయా
నీవు పొందిన మరణం యేసయ్యా - నాకు జీవం పోసింది మెస్సీయా
Verse
నీ దేహపు గాయం యేసయ్యా - స్వస్థత కలిగించింది మెస్సీయా
నీ కలువరియాగం యేసయ్యా - కొత్తజన్మనిచ్చింది మెస్సీయా

Related Tags

WorshipSalvationJesusMessiah