Chorus
నీ సమాధానము దాసుని కిప్పుడు నాధా దేవా యిచ్చి నీ
మాటచొప్పున పోనిచ్చుచున్నావు నాధా దేవా‖ నీ సమాధానము ‖
Verse
అన్యులకు నిన్ను బయలు పరచెడి వెలుగుఁగాను నీకు నణఁగు
ప్రజలైన యిశ్రాయేల్ వారికి మహిమ గాను‖ నీ సమాధానము ‖
Verse
నరులకై నీవు ఏ ర్పరచిన రక్షణన్ నాధా దేవా యిదిగో నాకనులు
చూచి యా నందించుచున్నవి నాధా దేవా‖ నీ సమాధానము ‖
Verse
తండ్రికి సుతునికిఁ బరిశుద్ధాత్మకును గలుగుగాక మహిమ తరుగక
సదాకాలము యుగయుగములకును గలుగు నామేన్‖ నీ సమాధానము ‖