Chorus
నీ సిలువే నాకు శరణు యేసుప్రభో!
Verse
దురితదూరుడా నీదరి జేరగ
నాదు పాప శాపము దీర్చి
దరిజేర్చితివి కృపతో
Verse
శాశ్వతముగ నన్ను ప్రేమించితివి
నీదు ప్రేమకు నేనే సాక్షిని
బలమగు నీదు కృపతో
Verse
నా హృదయములో భారములెల్లను
సిలువను జూడగ సమసిపోయెను
శక్తిగల నీ కృపతో
Verse
రక్తముకార్చి మరణము గెల్చి
శత్రు సైతానును ఓడించి
విజయమిచ్చితివి కృపతో
Verse
నీవు పొందిన బాధలవలన
నిత్యసుఖంబులు సంపూర్ణముగ
పొందితి నీదు కృపతో
Verse
యేసు నా సిలువను నే మోసి
ఇలలో నిన్ను వెంబడించుటకు
ధైర్యమిచ్చితివి కృపతో
Verse
నీ రాకడకై నిరీక్షించు
నిత్యకృపను నే పొందితినంచు
పాడెదను హల్లెలూయ