Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Snehamu Entho Sathyamu

నీ స్నేహము ఎంతో సత్యము

Nee Snehamu Entho Sathyamu

Verse
నీ స్నేహము ఎంతో సత్యము
ఆద్యంతము నా హృదిలో పదిలము‖ 2x ‖
నా సఖుడా ప్రియ యేసయ్య
నా హితుడా స్నేహితుడా‖ 2x ‖
నీవెంత గొప్ప వాడివయ్యా
నను ఆదరించినావయ్యా‖ 2x ‖
Verse
సింహాల బోనులో నా ప్రాణానికి
ప్రాణమైన నా విభుడవు
చెరసాలలోన సంకెళ్ళు విరచి
విడుదల నిచ్చిన రక్షక‖ 2x ‖
కన్న తల్లి కూడా నన్నెరుగక మునుపే
నన్నెరిగిన నా తండ్రివి‖ నా సఖుడా ‖
Verse
గొల్యాతయినా ఏ యుద్ధమైనా
విజయము నిచ్చిన వీరుడవు
పదివేలమంది నా వైపు కూలినా
నాతో నిలచిన ధీరుడవు‖ 2x ‖
నా దోశములను నీదు రక్తముతో
తుడిచివేసిన పరిశుద్ధుడవు‖ నా సఖుడా ‖
Verse
ఏ ఎన్నిక లేని నను ప్రేమించిన కృపామయుడవు
అందరు విడిచిన నన్నెన్నడు విడువని కరుణామయుడవు‖ 2x ‖
నిస్సారమైన నా జీవితములో
సారము పోసిన సజీవుడవు‖ 2x నా సఖుడా ‖

Related Tags

DevotionalJesusFriendship