Verse
నీ స్నేహము నను మనిషిని చేసింది
నా హృదయముకు ప్రేమించుట నేర్పింది
విలువైన రక్తము నా కొరకు ధారపోసి
నిలువెల్ల నలిగితివా ఈ ఘోరపాపి కొరకు
దోషములన్నీ కడిగి నాలో జీవం నింపితివి
ప్రేమమయుడా, సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, నా యేసయ్య
Verse
నా తల మీద ప్రవహించే సంద్రము వంటివి
బాల్యము నుండి నే చేసిన పాపపు కార్యములు
నా దుష్కార్యములన్నీ నీ వీపువెనక వేసి
దీవెనగా చేయుటకు నా పాప మంతటిని మరిచావు
సాధ్యము కాని కార్యములు నీ దయతో పొందితిని
నీ మేలులు మరచి పశుప్రాయుడనై వీపును చూపితినీ
నా అవిధేయతలన్నీ నీ వేలితో చెరిపి
నా ఎముకలలో నీ వాక్యము నే అగ్నికణముగా దాచావు
మరణము వరకు నీతోనే నే ఉంటానంటినీ
స్థిరముగ నిలిచి నీతో ఉండుట కలగా మార్చితిని
కుమారుని రక్తముతో హిమమంత తెలుపు చేసి
పరిశుద్ధులలో నను చేర్చుటకు సిలువ కిరణమై వెలిగావు