Verse
నీ స్వరము వినిపించు ప్రభువా
నీ దాసుడాలకించున్‖ 2x ‖
నీ వాక్యమును నేర్పించు
దానియందు నడుచునట్లు నీతో‖ నీ స్వరము ‖
Verse
ఉదయమునే లేచి – నీ స్వరము వినుట
నాకు ఎంతో మధురము
దినమంతటి కొరకు – నను సిద్ధపరచు
రక్షించు ఆపదలనుండి –‖ 2x నీ స్వరము ‖
Verse
నీ వాక్యము చదివి – నీ స్వరము వినుచు
నేను సరి చేసికొందు
నీ మార్గములో – నడుచునట్లుగా
నేర్పించుము ఎల్లప్పుడూ –‖ 2x నీ స్వరము ‖
Verse
భయ భీతులలో – తుఫానులలో
నీ స్వరము వినిపించుము
అభయము నిమ్ము – ఓ గొప్ప దేవా
ధైర్య పరచుము నన్ను –‖ 2x నీ స్వరము ‖
Verse
నాతో మాట్లాడు – స్పష్టముగా ప్రభువా
నీ స్వరము నా కొరకే
నీతో మనుష్యులతో – సరిచేసికొందు
నీ దివ్య వాక్యము ద్వారా –‖ 2x నీ స్వరము ‖
Verse
నేర్చుకున్నాను – నా శ్రమల ద్వారా
నీ వాక్యమును ఎంతో
నన్నుంచుము ప్రభువా – నీ విశ్వాస్యతలో
నీ యందు నిలచునట్లు –‖ 2x నీ స్వరము ‖
Verse
నా హృదయములోని – చెడు తలంపులను
చేధించు నీ వాక్యము
నీ రూపమునకు – మార్చుము నన్ను
నీదు మహిమ కొరకేగా –‖ 2x నీ స్వరము ‖