Chorus
నీ స్వరము వినిపించు ప్రభువా
నీ దాసుడాలకించున్
నీ వాక్యమును నేర్పించు
దాని యందు నడచునట్లు నీతో
Verse
ఉదయమునే లేచి నీ స్వరము వినుట
నాకు ఎంతో మధురము
దినమంతటి కొరకు నను సిద్ధపరచు
రక్షించు ఆపదల నుండి
Verse
నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు
నేను సరిచేసికొందు
నీ మార్గములో నడచునట్లుగా
నేర్పించుము ఎల్లప్పుడు
Verse
భయ భీతులలో తుఫానులలో
నీ స్వరము వినిపించుము
అభయము నిమ్ము ఓ గొప్ప దేవా
ధైర్యపరచుము నన్ను
Verse
నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా
నీ స్వరము నా కొరకే
నీతో మనుష్యులతో సరిచేసికొందు
నీ దివ్య వాక్యము ద్వారా
Verse
నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది
అది రెండంచులుగల ఖడ్గం
నీ వాక్యమేగా అద్భుత అద్దం
నిజ స్వరూపమును చూపించున్
Verse
నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా
నీ వాక్యమును ఎంతో
నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో
నీ యందు నిలచునట్లుగా
Verse
నా హృదయములోని చెడు తలంపులను
ఛేదించు నీ వాక్యము
నీ రూపమునకు మార్చుము నన్ను
నీదు మహిమ కొరకేగా