Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Swaramu Vinipinchu Prabhuvaa Nee Daasudaalakinchun

నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్

Nee Swaramu Vinipinchu Prabhuvaa Nee Daasudaalakinchun

Verse
పల్లవి: నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్
నీ వాక్యమును నేర్పించు దానియందు నడచునట్లు నీతో .. నీ..‖ నీ ‖
Verse
ఉదయముననే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము
దినమంతటి కొరకు నను సిద్దపరచు రక్షించు ఆపదల నుండి .. నీ..‖ నీ ‖
Verse
నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు సరి జేసుకొందు
నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు .. నీ..‖ నీ ‖
Verse
భయ భీతులతో తుఫానులలో నీ స్వరము వినిపించుము
అభయము నిమ్ము ఓ గొప్ప దేవా ధైర్యపరచుము నన్ను .. నీ..‖ నీ ‖
Verse
నాతో మాట్లాడు స్పస్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే
నీతో మనుష్యులతో సరిజేసుకొందు నీ దివ్య వాక్యము ద్వారా .. నీ..‖ నీ ‖

Related Tags

PrayerDevotionGuidance