Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Thyagam Naa Viluvanu Penchindi

నీ త్యాగం నా విలువను పెంచింది

Nee Thyagam Naa Viluvanu Penchindi

Lyricist: John Wesly
Verse 1
నీ త్యాగం నా విలువను పెంచింది
నీ రుధిరం నా పాపం తుడిచింది
నీ శాంతం నా మదిని గెలిచింది
నీ ప్రేమయే నా గాయం మాన్పింది.
Chorus
నీ సిలువే నా శరణం నీ రక్తమే నా విజయం.
Verse
విలువే లేని నాకోసం – మరణించావు ఈ భువిలో
చలనం లేని నా బ్రతుకు – చిగురించింది నీ ప్రేమలో
కమ్మేసిన చీకట్లను – నిత్య వెలుగుగా మార్చావు
సర్వస్వము నాకోసము – సిల్వపై ధారపోశావు.
Verse
జీవం లేని నాకోసం – జాలినొందెను నీ హృదయం
ప్రేమతో నిండిన నీ స్పర్శతో- వికసించింది నా మనసు
సాటెవ్వరు నా యేసయ్య – ఈ జీవితం నీకెనయ్య
ప్రత్యేకము నీ స్వాస్థ్యము – సాగిపోదును నీకోసమే

Related Tags

GraceSalvationSacrifice