Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Thyagame Ne Dhyaninchuchu

నీ త్యాగమే నే ధ్యానించుచూ

Nee Thyagame Ne Dhyaninchuchu

Lyricist: Pastor Suresh
Verse
నీ త్యాగమే నే ధ్యానించుచూ
నీ కోసమే ఇల జీవించెదా
నీతిమంతుడా షాలేము రాజా
ఆరాధన నీకే
గడియ గడియకు నిన్ను గాయపరచితి
గతమునే మరచి నిన్ను హింసించితి
అయినా విడువలేదు నీ కృపా
నన్నెన్నడు మరువలేదు నీ ప్రేమ
ఇహలోక ఆశలలో పడియుండగా
నీ సన్నిధి విడిచి నీకు దూరమవ్వగా
అయినా విడువలేదు నీ కృపా
నన్నెన్నడు మరువలేదు నీ ప్రేమ
హృదయమనే వాకిట నీవు నిలిచినా
నిన్ను కానకా నే కఠినుడనైతి
అయినా విడువలేదు నీ కృపా
నన్నెన్నడు మరువలేదు నీ ప్రేమ

Related Tags

WorshipRepentanceGood FridaySacrifice