Chorus
నీ వాక్కు వినిపించుమయ్యా - నేత్రాలు తెరిపించుమయ్యా‖ 2x ‖
నీ ముఖమును నాకు చూపుమూ - నీ మహిమకు నన్ను మార్చుము‖ 2x ‖
Verse
నీ తట్టు చూడగా వెలుగు కలుగును - ముఖములందు సిగ్గు కాన రాకపోవును‖ 2x ‖
నీ ముఖదర్శనమే సంతోషమిచ్చును - నీ కటాక్షమే నన్ను విమోచించును‖ 2x ‖
Verse
నీ వైపు తిరుగగా ముసుగు తొలగును - ముఖములందు గొప్ప మహిమ ప్రతిఫలించును‖ 2x ‖
నీ ముఖకాంతియే నాకు విజయమిచ్చును - నీ హస్తమే నన్ను రక్షించును‖ 2x ‖