Verse
నీ వాక్యమే నా పాదాలకు దీపము
నీ చిత్తమే నా జీవిత గమనము‖ 2x ‖
కృప వెంబడి కృపతో – నను ప్రేమించిన దేవా‖ 2x ‖
వందనాలయ్యా నీకే – వేలకొలది వందనాలయ్యా
స్తోత్రాలయ్యా నీకే – కోట్లకొలది స్తోత్రాలయ్యా
Verse
నీ భారము నాపై వేయుము
ఈ కార్యము నే జరిగింతును‖ 2x ‖
నా కృప నీకు చాలును
అని వాగ్దానమిచ్చావయ్యా‖ 2x వందనాలయ్యా ‖
Verse
పర్వతములు తొలగిననూ
మెట్టలు తత్తరిల్లిననూ‖ 2x ‖
నా కృప నిన్ను వీడదు
అని అభయాన్ని ఇచ్చావయ్యా‖ 2x వందనాలయ్యా ‖