Verse
నీ వాక్యమే నన్ను బ్రతికించెను
బాధలలో నెమ్మదినిచ్చెను‖ 2x ‖
కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా‖ 2x నీ వాక్యమే ‖
Verse
జిగటగల ఊభినుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను‖ 2x ‖
నా పాదములకు దీపమాయెను‖ 2x ‖
సత్యమైన మార్గములో నడుపుచుండెను‖ 2x నీ వాక్యమే ‖
Verse
శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది‖ 2x ‖
అపవాది వేయుచున్న అగ్ని బాణములను‖ 2x ‖
ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది‖ 2x నీ వాక్యమే ‖
Verse
పాలవంటిది జుంటి తేనె వంటిది
నా జిహ్వకు మహా మధురమైనది‖ 2x ‖
మేలిమి బంగారు కన్న మిన్న అయినది‖ 2x ‖
రత్న రాసులకన్నా కోరతగినది‖ 2x నీ వాక్యమే ‖