Chorus
నీ వాక్యమే నన్ను బ్రతికించెను - బాధలలో నెమ్మది నిచ్చెను
కృపాసత్య దయాశక్తి సంపూర్ణుడా
వాక్యమై యున్న యేసు వందనమయ్య‖ నీ వాక్యమే ‖
Verse
పాలవంటిది జుంటితేనె వంటిదీ
నా జిహ్వకు మహా మధురమైనది
మేలిమి బంగారుకన్న మిన్న అయినది
రత్న రాసులకన్న కోరదగినది‖ నీ వాక్యమే ‖
Verse
జిగటగల ఊబి నుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను
నా పాదములకు దీపమాయెను
సత్యమైన మార్గములో నన్ను నడిపెను‖ నీ వాక్యమే ‖
Verse
శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్ధమునకు సిద్ధమనస్సు నిచ్చుచున్నది
అపవాది వేయుచున్న అగ్నిబాణములను
ఖడ్గమువలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది‖ నీ వాక్యమే ‖