Verse
నీ వాక్యమే శ్రమ కొలిమిలో
నను బ్రతికించుచున్నది‖ 2x ‖
నా బాధలో అది బహు నెమ్మది
కలిగించుచున్నది‖ 2x నీ వాక్యమే ‖
Verse
శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము
సంతోషమీయని యెడల‖ 2x ‖
బహు కాలము క్రితమే నేను – నశియించియుందునయ్యా
నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతున్‖ 2x ప్రభు నీ వాక్యమే ‖
Verse
నీ శాసనములే ఆలోచన-
కర్తలై నన్ను నడుపుట వలన‖ 2x ‖
నా శత్రువుల మించిన జ్ఞానము – నాకిలను కలిగెనయ్యా
నీ ఆజ్ఞలను నేను తలదాల్తును‖ 2x ప్రభు నీ వాక్యమే ‖
Verse
వేలాది వెండి బంగారు నాణెముల
విస్తార ధన నిధి కన్నా‖ 2x ‖
నీ ధర్మశాస్త్రము యెంతో – విలువైన నిధి ప్రభువా
నీ ఆజ్ఞలను బట్టి నిను పొగడడం‖ 2x ప్రభు నీ వాక్యమే ‖