Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Vaathma Yuddhamulo Jaya Mondumu

నీ వాత్మ యుద్ధములో జయ మొందుము

Nee Vaathma Yuddhamulo Jaya Mondumu

Chorus
నీ వాత్మ యుద్ధములో జయ మొందుము
ఓ నా సోదరా వెనుకంజ వేయకు
ఓ నా సోదరి వెనుకంజ వేయకు
Verse
స్వామి యేసు తన సిలువను మోసి
సైతాను రాజ్యము - పూర్తిగా జయించె
నీవును యేసుని వెంబడి వెళ్ళుమా
ఓ నా సోదరా వెనుకంజ వేయకు
ఓ నా సోదరి వెనుకంజ వేయకు
Verse
శిరమున ముండ్ల మకుటము ధరించి
సిపాయిచే తలపై కొట్టబడె
నీ శిరస్సు నట్లే సమర్పించు
ఓ నా సోదరా వెనుకంజ వేయకు
ఓ నా సోదరి వెనుకంజ వేయకు
Verse
కల్వరి పైకి - ఒంటరిగానే
వెళ్ళెను యేసు - త్యాగ సహితుడై
నీవును ఆ దారినే వెళ్ళుమా
ఓ నా సోదరా వెనుకంజ వేయకు
ఓ నా సోదరి వెనుకంజ వేయకు
Verse
లోకస్తులంతా - నిద్రించుచుండగా
మోకాళ్ళపై యేసు - కొండపై నుండె
నీవును ప్రార్థన శక్తి నొందుమా
ఓ నా సోదరా వెనుకంజ వేయకు
ఓ నా సోదరి వెనుకంజ వేయకు
Verse
సాహసమున నీ - వాత్మ ఖడ్గమున
సైతాను బంధము - ఖండించివేసి
క్రీస్తుని సంఘమా - ముందంజ వేయుమా
ఓ నా సోదరా వెనుకంజ వేయకు
ఓ నా సోదరి వెనుకంజ వేయకు

Related Tags

PrayerSpiritual WarfareVictory