Chorus
నీ వాక్యమే నన్ను బ్రతికించెను
భాధలలో నెమ్మది నిచ్చెను
కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా
వాక్యమైయున్న యేసు వందనమయ్యా
Verse
జిగటగల ఊభినుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను
నా పాదములకు దీపమాయెను
సత్యమైన మార్గములో నడుపుచుండెను‖ 2x ‖
Verse
శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్దమునకు సిద్దమనసు నిచ్చుచున్నది
అపవాది వేయుచున్న అగ్ని భాణములను
ఖడ్గమువలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది‖ 2x ‖
Verse
పాల వంటిది జుంటె తేనె వంటిది
నా జిహ్వకు మహా మధురమైనది
మేలిమి బంగారుకంటే మిన్నయైనది
రత్న రాశులకన్న కోరతగినది‖ 2x ‖