Verse
నీదెంతో కరుణా కరుణామయా
నీదెంతో జాలి నజరేయా‖ 2x ‖
Verse
మా పాపమంతా గాయాలుగా
దాల్చావు నీ మీన పూమాలగా‖ 2x ‖
మా కర్మమంతా ఆ సిలువగా
మోసేవు తండ్రి నీ మోపున‖ నీదెంతో ‖
Verse
ప్రభువా మా పాప ప్రక్షాళనముకై
వెలపోసినావు నీ రుధిరమే‖ 2x ‖
దేవా మా ఆత్మ పరిశుద్ధికై
బలి పెట్టినావు నీ ప్రాణమే‖ నీదెంతో ‖