Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Needhanamu Neeghanamu Prabhu Yesude

నీధనము నీఘనము ప్రభు యేసుదే

Needhanamu Neeghanamu Prabhu Yesude

Verse
నీధనము నీఘనము ప్రభు యేసుదే
నీ దశమాభాగములెల్ల నీయ వెనుదీతువా
Verse
ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా
పరలోక నాధుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా
Verse
పాడిపంటలు ప్రభువు నీకియగా కూడుగుడ్డలు నీకు దయచేయగా
పాడంగ ప్రభుయేసు నామంబును గడువేల ప్రభుకీయ ఓ క్రైస్తవా
Verse
వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభునీకు ఉచితంబుగా
వెలిగించ ధరయందు ప్రభు నామము కలిమి కొలది ప్రభునకర్పించవా
Verse
కలిగించే సకలంబు సమృద్దిగా తొలగించె పలుభాధ భరితంభులు
బలియాయె నీపాపముల కేసుడు చెలువంగ ప్రభుకీయ చింతింతువా
Verse
పరిశుద్ద దేవుని మంధిరమున్‌ పరిపూర్ణముగాను యోచించుడి
పరిశుద్ధ బాగంబు విడదీయుడి పరమాత్మ దీవెనలను బొందుడి

Related Tags

OfferingStewardshipTithe