Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Needhu Prema Naalo

నీదు ప్రేమ నాలో

Needhu Prema Naalo

Lyricist: Prabhu Pammi
Verse
నీదు ప్రేమ నాలో ఉంచి జీవమునిచ్చావు
నీదు రూపమే నాలో ఉంచి నన్ను చేసావు
మంటివాడను నన్ను నీవు మహిమపరిచావు
మరణపాత్రుడనైన నన్ను పరము చేర్చావు
ఎంత ప్రేమ యేసయ్యా – నీకెంత నాపై కరుణయో
మరువగలనా నీ కృప – బ్రతుకంతయు‖ 2x ‖
Verse
తోడువైనావు నా నీడవైనావు
నీవు నాకు ఉండగా నాకు ఈ దిగులెందుకు
మంచి కాపరి నీవేనయ్యా నా యేసయ్యా
ఎంచలేనయ్యా నీ వాత్సల్యం ఓ మెస్సయ్యా
జీవితమంతా మరువలేనయ్యా‖ నీదు ప్రేమ ‖
Verse
ప్రాణమైనావు నీవే ధ్యానమైనావు
అన్నీ నీవై చేరదీసి ఆశ్రయమైనావు
నీతిసూర్యుడా పరిపూర్ణుడా నిత్య దేవుడా
కీర్తనీయుడా కృపాపూర్ణుడా సత్యజీవుడా
నేను నిన్ను విడువలేనయ్యా‖ నీదు ప్రేమ ‖

Related Tags

PraiseWorshipGrace