Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Needhu Vishvaasyatha Maa Prabhu Yaesu Amtharikshmu Nadhigamimchenu

నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నధిగమించెను

Needhu Vishvaasyatha Maa Prabhu Yaesu Amtharikshmu Nadhigamimchenu

Chorus
నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు
అంతరిక్షము నధిగమించెను
Verse
నిను ప్రేమించి నీ ఆజ్ఞలను
అనుసరించు మనుజావళికి
నిబంధనను స్థిరముగ జేసి
నిరతము నలరారెడు మా ప్రభువా
Verse
వేయి తరముల వరకు సరిగా
విలసిల్లేటి వెలలేని మా
వింతల కృపాంబుధి యగుదేవా
యెంతయో నిను స్తుతియింతుము కోరి
Verse
నీ సత్య సంధత్వ మహిమ
నిరతము నిలయం సంస్తుతులకు
మెరసెను నా మదిలోన దేవా
మరువగ లేమీ మధుర ప్రేమ
Verse
ఎంతైనను నమ్మదగిన
వింతైన నీ విశ్వాస్యత
వాత్సల్యత వెలసెను మాపై
క్రొత్తగ ప్రతి దినము యేసు ప్రభో
Verse
మన ఆత్మనుజీవము దేహమును
మన ప్రభుయేసు రాకడవరకు
వొసరుగ కాపాడును పదిలముగా
దిన దినమును నిందారహితముగ
Verse
తండ్రికుమార శుద్ధాత్మకును
తర తరములకు మహిమ ఘనత
పరిపూర్ణముగా ప్రబలును గాక
పరిపరి విధముల ప్రభు సంఘములో

Related Tags

WorshipGraceFaithfulness