Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Needu Premaku Haddu Ledaya

నీదు ప్రేమకు హద్దు లేదయా

Needu Premaku Haddu Ledaya

Verse
నీదు ప్రేమకు హద్దు లేదయా
నీదు ప్రేమకు కొలత లేదయా
నీదు ప్రేమకు సాటి రారయా.. ఎవ్వరు
పొగడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా‖ నీదు ‖
Verse
తల్లి తండ్రులు చూపలేని ప్రేమ
తనయులివ్వని తేటనైన ప్రేమ‖ 2x ‖
పేదలకు నిరు పేదలకు
విధవలకు అనాథలకు‖ 2x ‖
బంధు మిత్రులు చూపలేని ప్రేమా‖ 2x ‖
కొనియాడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా‖ నీదు ‖
Verse
నరులకై నర రూపమైన ప్రేమ
పరము చేర్చగ ప్రాణమిచ్చిన ప్రేమ‖ 2x ‖
దొంగలకు వ్యభిచారులకును
కౄరులకు నర హంతకులకు
మనుజులివ్వని మధురమైన ప్రేమా‖ 2x ‖
కీర్తించదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా‖ నీదు ‖

Related Tags

PraiseWorshipJesus