Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Needu Sanni Dhaanamandhu O Naa Yesura

నీదు సన్ని ధానమందు ఓ నా యేసుర

Needu Sanni Dhaanamandhu O Naa Yesura

Lyricist: Heles Lakshmi Gore
Verse
నీదు సన్ని ధానమందు
ఓ నా యేసురక్షకా
నాదు నాత్మ చేరి యందు
నెంత తృప్తి పొందును
ఎంత శ్రేష్ఠమైన బోధ
నేను నేర్చుకొందును
నీతి మార్గమందు నడ్వ
నెంత ధైర్య మొందుదున్!
Verse
లోక ధనాపేక్షయైన
నన్ను మోసపుచ్చదు
ఇహ దుఃఖబాధ లెన
నన్ను భయపర్చవు
నా విరోధియైన సాతాన్
నన్ను వెంబడించినన్
నీదు సన్నిధానమందు
యేసు నన్ను దాఁగనీ.
Verse
యేసు శరణంబువల్ల
కల్గు మధురంబును
నీవు రుచిచూడ వాంఛ
నీకుఁ గల్గి యున్నదా?
యేసు శరణంబుఁ జొచ్చు
మిది నీకు లాభము
ఆయన స్వరూప మిట్లు
నీకుఁ గూడఁ గల్గును.

Related Tags

WorshipDevotionalPresence