Verse
నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు
అంతరిక్షము నధిగమించెను‖ 2x ‖
Verse
నిను ప్రేమించి నీ ఆజ్ఞలను
అనుసరించు మానుజావళికి‖ 2x ‖
నిబంధనను స్థిరముగ జేసి‖ 2x ‖
నిరతము నలరారెడు మా ప్రభువా‖ 2x నీదు ‖
Verse
వేయి తరముల వరకు సరిగా
విలసిల్లేటి వెలలేని మా‖ 2x ‖
వింతల కృపాంబుధి యగు దేవా‖ 2x ‖
యెంతయో నిను స్తుతియింతుము కోరి‖ 2x నీదు ‖
Verse
నీ సత్య సంధత్వ మహిమ
నిరతము నిలయం సంస్తుతులకు‖ 2x ‖
మెరసెను నా మదిలోన దేవా‖ 2x ‖
మరువగ లేమి మధుర ప్రేమ‖ 2x నీదు ‖
Verse
ఎంతైనను నమ్మదగిన
వింతైన నీ విశ్వాస్యత‖ 2x ‖
వాత్సల్యత వెలసెను మాపై‖ 2x ‖
క్రొత్తగా ప్రతి దినము యేసు ప్రభు‖ 2x నీదు ‖
Verse
మన ఆత్మను జీవము దేహమును
మన ప్రభు యేసు రాకడ వరకు‖ 2x ‖
వొనరుగ కాపాడును పదిలముగా‖ 2x ‖
దిన దినమును నిందారహితముగా‖ 2x నీదు ‖
Verse
తండ్రి కుమార శుద్ధాత్మకును
తర తరములకు మహిమ ఘనత‖ 2x ‖
పరిపూర్ణముగా ప్రబలును గాక‖ 2x ‖
పరి పరి విధముల ప్రభు సంఘములో‖ 2x నీదు ‖