Verse
నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా
నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా‖ 2x ‖
మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా
కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా‖ నీకంటె ‖
Verse
కొట్టబడిన వేళ
నా గాయం కట్టినావే‖ 2x ‖
బాధించినా స్వస్థపరిచేది నీవే‖ 2x నీకంటె ‖
Verse
అణచబడిన వేళ
నా తలను ఎత్తినావే‖ 2x ‖
శిక్షించినా గొప్ప చేసేది నీవే‖ 2x నీకంటె ‖
Verse
విడువబడిన వేళ
నను చేరదీసినావే‖ 2x ‖
కోపించినా కరుణ చూపేది నీవే‖ 2x నీకంటె ‖