Verse
నీకసాధ్యమైనది ఏదియు లేదు
సమస్తము సాధ్యము నీకు‖ 2x ‖
ప్రభువా ప్రభువా
సమస్తము సాధ్యం‖ 2x నీకసాధ్యమైనది ‖
Verse
వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం – సాధ్యం
బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం – సాధ్యం‖ 2x ‖
నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా
నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా‖ 2x ‖
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా‖ 2x నీకసాధ్యమైనది ‖
Verse
పాపమునుండి విడిపించుట సాధ్యం – సాధ్యం
శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం – సాధ్యం‖ 2x ‖
నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా‖ 2x ‖
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా‖ 2x నీకసాధ్యమైనది ‖
Verse
దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం – సాధ్యం
నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం – సాధ్యం‖ 2x ‖
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా‖ 2x ‖
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా‖ 2x నీకసాధ్యమైనది ‖
Verse
సర్వ సత్యములో నడిపించుట సాధ్యం – సాధ్యం
పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం – సాధ్యం‖ 2x ‖
నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా‖ 2x ‖
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా‖ 2x నీకసాధ్యమైనది ‖