Verse
నీకు ఇష్టముగా ఇలలో నే ఉండాలని
ఎంత కష్టమైనా నీలోనే ఉండాలని
ఆశతో ఉన్నాను నా యేసయ్యా
ఆశలు తీర్చే నా మెస్సయ్యా‖ 2x ‖
నువ్వంటే ఇష్టము నా యేసయ్యా
నాతో నువ్వుంటే ఇష్టము నా మెస్సయ్యా‖ 2x ‖
Verse
నీ వెంటే నేను నడవాలని
నీ ఇంటిలోనికి రావాలని‖ 2x ‖
నీ వాక్యపు రుచి నాకు చూపావయ్యా
నీ వాత్సల్యతతో నను నింపావయ్యా‖ 2x ‖
అందుకేనయ్యా నువ్వంటే నాకిష్టం
అందుకోవయ్యా నాలోని నీ ఇష్టం‖ 2x Nuvvante ‖
Verse
ఎన్నో శోధనలు ఎన్నెన్నో శ్రమలతో
ఈ లోకంలో నే పడియుండగా‖ 2x ‖
నీ కృపచేత నను నీవు నిలిపావయ్యా
నీ కరుణతో నను నీవు నడిపావయ్యా‖ 2x ‖
అందుకేనయ్యా నువ్వంటే నాకిష్టం
అందుకోవయ్యా నాలోని నీ ఇష్టం‖ 2x Nuvvante ‖