Verse
నీకు కలిగిన దానిని - చేపట్టుము
జారవిడచెదవేమో - జాగ్రత్తపడు‖ 2x ‖
Verse
పరమునకు విజయోత్సవముతో - మనము వెళ్ళెదము
పూర్ణ ఫలమును సంతసములో - మనము పొందెదము
Verse
క్రీస్తు యేసుని స్వీకరించి - ప్రభులో నడచెదము
వేరుపారి స్థిరతనొంది - విస్తరించెదము
Verse
లోక ఇచ్చలనన్ని మనము - విడచి పెట్టెదము
ప్రభుని చిత్తము నెరిగి లోబడి - నిలిచియుండెదము
Verse
ఓపికతో పందెములో మనము - పాలు పొందెదము
యేసువైపే దృష్టియుంచి - సాగి పోయెదము
Verse
చింతలన్నియు ప్రభుని మీదే - మనము వేసెదము
ఆయనే నిరతంబు మనపై - చింతగలవాడు
Verse
బహు శీఘ్రముగా శ్రీ యేసు - మరల వచ్చును
మనకు కలిగిన నిరీక్షణను - విడువ కుండెదము